
నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
మెదక్ మున్సిపాలిటీ: ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని గాంధీనగర్ వీధిలో రూ. 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా మ్యాప్‌ను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌ను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈని ఆదేశించారు.
జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడితే తక్షణమే దగ్గరలోని పీహెచ్‌సీని సందర్శించి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ రోగులకు సూచించారు. ఆదివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధు లు సంభవిస్తున్నాయని, జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని చెప్పారు. కౌడిపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఈఈ టీజీఎంఐడీసీని ఆదేశించారు. అనంతరం కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్