
సమస్యల పరిష్కారానికి పోరాటం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు
మెదక్ కలెక్టరేట్: గ్రామాల్లో ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన జిల్లాస్థాయి పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో మురుగు నీటి కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. పంచాయతీలకు బడ్జెట్ లేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదన్నారు. దోమలు, ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి నర్స మ్మ, కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం పాల్గొన్నారు.