
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
వెల్దుర్తి(తూప్రాన్): ప్రధాని మోదీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కవితారెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఆదివారం మండలంలోని మానెపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని కేంద్ర పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. గ్రామంలో అమరవీరుల విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలు వేశారు. అలాగే జానకంపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మధును సత్కరించారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు వెంకటేశం, మండల ఇన్‌చార్జి బాలరాజు, మండల అధ్యక్షుడు దాసు, నాయకులు పాల్గొన్నారు.