
సృజనాత్మకతకు వేదిక
ముక్కు మూసుకొని నిరసన తెలుపుతున్న ప్రజలు
జిల్లా వివరాలు
విద్యాసంవత్సరం వచ్చిన ప్రాజెక్ట్‌లు
2022–23 54
2023–24 38
2024–25 54
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘ఇన్‌స్పైర్ మనక్’ చక్కని వేదిక. ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లు ఉపాధ్యాయులకు సూచించాయి.
దరఖాస్తు ఇలా..
ముందుగా పాఠశాలను www.inspireawards&dst.in ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదివరకే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే స్కూల్ అథారిటీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ తయారు చేసే విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఫొటో, ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఇన్‌స్పైర్ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను సెప్టెంబర్ 15వ తేదీలోపు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాలి.
ఎంపికై తే రూ. 10 వేలు బహుమానం
ప్రభుత్వ, ప్రైవేట్, జెడ్పీహెచ్‌ఎస్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులుగా నిర్ధారించారు. ప్రతి తరగతి విద్యార్థి ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టుల అవసరాల మేరకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.10 వేలు అందిస్తుంది. విద్యార్థులు తాము రూపొందించే ప్రాజెక్ట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఇన్‌స్పైర్ మనక్ వెబ్‌సైట్‌కు పంపించాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు వివరాలను సరిచూసుకొని ఎంపికై న విద్యార్థి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్‌గా అనుకరణలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. గతంలో ఇన్‌స్పైర్ మనక్‌లో ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లు తిరిగి ఈసారికి అనుమతించరు. కేవలం కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులతో రూపొందించిన వాటికి మాత్రమే ప్రోత్సాహం ఉంటుంది.
పాఠశాలల్లో ‘ఇన్‌స్పైర్ మనక్’ సెప్టెంబర్ 15 వరకు అవకాశం
ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు
జిల్లాలో ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలు ఇన్‌స్పైర్ మనక్‌లో పాల్గొంటున్నాయి. అలా కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు ప్రాజెక్ట్‌లు ఇన్‌స్పైర్ మనక్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా ఐడియా కాంపిటీషన్ బాక్స్‌ను ఏర్పాటు చేసి ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
విద్యార్థులను ప్రోత్సహించాలి
ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టించగలరు. వారిలో దాగి ఉన్న సృజనాత్మకత టీచర్లకే తెలుస్తుంది. వారు నూతన ఆవిష్కరణలు తయారు చేసేందుకు చక్కని వేదిక ఇన్‌స్పైర్ మనక్. దీని ద్వారా దేశానికి శాస్త్రవేత్తలను అందించేందుకు కృషి చేయాలి.
– చిలుముల రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి

సృజనాత్మకతకు వేదిక

సృజనాత్మకతకు వేదిక