
దుర్వాసన భరించలేం
జిన్నారం(పటాన్‌చెరు): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని అయ్యమ్మ చెరువు నిండుకుండలా మారింది. సమీ పంలోని ఇళ్లకు వరద నీరు రావడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయన వ్యర్థ జలాలతో కలుషితమయంగా మారిన చెరువు నీరు ఇళ్లకు సమీపంలోకి రావడంతో వాసన తట్లుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటిలో ఉండే పాములు, ఇతర కీటకాలు ఇళ్లల్లోకి రావడంతో ఆందోళన చెందుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.