
12న పరిశ్రమల కమిటీ సమావేశం
మెదక్ కలెక్టరేట్: ఈనెల 12న జిల్లాలోని హానికర పరిశ్రమల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల ఉప ప్రధాన అధికారి లక్ష్మీకుమారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని హానికర పరిశ్రమల కమిటీ సభ్యులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశానికి కమిటీ సభ్యులు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిశ్రమల అధికారులు, జిల్లా పర్యావరణ అధికారి, లేబర్ కమిషనర్, ఫైర్ తదితర శాఖల అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.
మంత్రులపై వ్యాఖ్యలు
సిగ్గుచేటు
పటాన్‌చెరు టౌన్: దళిత మంత్రులు దామోదర, వివేక్ వెంకటస్వామిపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు డివిజన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి దామోదర కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఇప్పటికై నా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతిక్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం బారులు
కౌడిపల్లి(నర్సాపూర్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. శనివారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 450 బస్తాల యూరియా రాగా, వివిధ గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. నిర్వాహకులు రైతు ఆధార్‌కార్డు, ఈ–పాస్ మిషన్ల ద్వారా యూరియా విక్రయించారు. రైతులు ఆందోళన చెందవద్దని సరిపడా యూ రియా అందుబాటులో ఏఓ స్వప్న తెలిపారు.
నులి పురుగుల
నివారణే లక్ష్యం
డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
మెదక్ కలెక్టరేట్: పిల్లల్లో నులి పురుగుల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11న జాతీయ నులి పురుగుల దినోత్స వం సందర్భంగా మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలు 2,11,964 మంది ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచే అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు వేసేలా తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని సబ్ సెంటర్, పీహెచ్‌సీలలో మాత్రలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఆర్టీసీ ‘స్పెషల్’ దోపిడీ
దుబ్బాకటౌన్: పండుగ పూట ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులపై చార్జీల పిడుగు పడింది. పండుగ స్పెషలంటూ బస్సులు నడుపుతూ అదనపు చార్జి వసూల్ చేయడం ప్రారంభించింది. దీంతో పండుగ పూట ప్రయాణికులపై పెను భారం పడింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూనే అదనపు చార్జీల పేరుతో మగవారి జేబుకు చిల్లుపెట్టింది. దుబ్బాక నుంచి సిద్దిపేటకు మామూలు రోజుల్లో ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.40 టికెట్ ఉండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏకంగా రూ.70 వసూలు చేయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. రూ.70 పెట్టిన కనీసం బస్సుల్లో సీటు దొరకపోవడం గమనార్హం. ఎక్స్‌ప్రెస్ పేరు పెట్టి గ్రామ గ్రామాన బస్సు ఆపడంతో ప్రయాణికులు విసుగు చెందారు.

12న పరిశ్రమల కమిటీ సమావేశం

12న పరిశ్రమల కమిటీ సమావేశం

12న పరిశ్రమల కమిటీ సమావేశం