
ఉత్తమ ఫలితాలు సాధించాలి
టేక్మాల్(మెదక్): కేజీబీవీల్లో చదివే విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మండలంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. చదువులో రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈసందర్భంగా విద్యార్థినులు కలెక్టర్‌కు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసి రిజిస్టర్ తనిఖీ చేశారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు.
నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
పాపన్నపేట(మెదక్): వినయోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని మి న్‌పూర్ 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు జరుగుతున్న విద్యుత్ సరఫరా తీరును పరిశీలించారు. సాంకేతిక సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.
ప్రణాళికలు సిద్ధం చేయండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా సౌర గిరిజల వికాస పథకం అమలు వేగవంతం చేయాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్