
ఉప్పు – నిప్పు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం
దుబ్బాక: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక రాజకీయం రాజు కుంటుంది. ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రెండ్రోజులక్రితం మెదక్ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ మంత్రుల పనితీరుపై తీవ్రస్థాయిలో దనుమాడారు. దీనికి కౌంటర్‌గా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అంతేస్థాయిలో ధ్వజమెత్తడంతో దుబ్బాక రాజకీయం ఉప్పు నిప్పుగా మారింది. దీనికి ఆజ్యం పోసేట్లు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటుండటంతో దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన సైతం రద్దయింది.
ఇంటెలిజెన్స్ సూచన మేరకే...
ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన రద్దు అయింది. వాస్తవానికి తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు శనివారం సాయంత్రం మంత్రి వివేక్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మాటల యుద్ధం
ఉద్రిక్తత నేపథ్యంలోనే
మంత్రి వివేక్ పర్యటన రద్దు

ఉప్పు – నిప్పు