
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగోడ్(మెదక్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండల కేంద్రంలో శనివారం మంత్రి పర్యటించారు. కార్యకర్తలతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ గృహాన్ని పరిశీలించి, మండలానికి మంజూరైన ఇళ్లు, నిర్మాణ పనులు ఎలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో విద్యుత్ తీగలు వేలాడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు మంజూరవుతాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూనే.. మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు మంత్రి దా మోదరకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, మాజీ జెడ్పీటీసీలు యాదగిరి, రాజేందర్ పాటిల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావు కులకర్ణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకరప్ప, మాజీ సర్పంచ్ విజయభాస్కర్, మాజీ ఎంపీటీసీ నరేందర్, కో ఆప్షన్ మాజీ సభ్యు డు చోటుమియా, వట్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ