
సంతోషంగా పండుగ జరుపుకోండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: రాఖీ పౌర్ణమిని జిల్లా ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని, రక్షణను, ప్రేమను రక్షాబంధన్ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబానికి సంతోషం, ఐక్యత, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షించారు.
అందుబాటులో యూరియా
నిజాంపేట(మెదక్): రైతులకు అందుబాటులో యూరియా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని పలు పీఏసీఎస్ కేంద్రా లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నానో యూరియా, డీఏపీ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి రైతులు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణం కోసం
సంతకాల సేకరణ
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తండాకు తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తండాకు తారు రోడ్డు మంజూరు కాగా, కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించే క్రమంలో కంకర పరిచి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సేకరించిన సంతకాలను కలెక్టర్‌కు అందజేస్తామని తండావాసులు పేర్కొన్నారు.
సమగ్ర విచారణ జరపాలి
చేగుంట(తూప్రాన్): మండలంలోని బీ.కొండాపూర్‌లో జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ జరిపారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించి బాధి త కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జూన్ 18న గ్రామంలో ఓ మైనర్ బాలిక కిడ్నాప్ కేసు విషయంలో బ్యాగరి చంద్రం కుటుంబ సభ్యు లు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఈసంఘటన విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంతోషంగా పండుగ జరుపుకోండి

సంతోషంగా పండుగ జరుపుకోండి

సంతోషంగా పండుగ జరుపుకోండి