
నో స్టాప్..!
● అక్కన్నపేట స్టేషన్‌లోఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లు
● పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు తప్పని తిప్పలు
రామాయంపేట(మెదక్): జిల్లాలోనే అతి పెద్దదైన అక్కన్నపేట రైల్వేస్టేషన్‌లో అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లు ఆగకపోవడంతో ఏళ్లుగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి, మేడ్చల్ మధ్య అతిపెద్ద స్టేషన్ ఇదే కావడంతో అత్యంత రద్దీగా ఉంటుంది. ఆదాయపరంగా మిగితా స్టేషన్ల కంటే మెరుగే. కాగా తిరుపతి, షిరిడీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలైన బాసర, నాందేడ్‌లోని గురుద్వారా ఆలయాలకు వెళ్లడానికి ఈస్టేషన్ నుంచి సదుపాయం లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రతీరోజు అక్కన్నపేట స్టేషన్ మీదుగా తిరుపతి వెళ్లే రాయలసీమ, షిరిడీ వెళ్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్ హాల్ట్ కోసం గతంలో గ్రామ స్తులతో పాటు ప్రయాణికులు పలుమార్లు రైల్‌రోకో నిర్వహించి కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరిగారు. కాగా మెదక్, సిద్దిపేట, ఇతర నగరాల నుంచి తిరుపతి, షిరిడీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి నిత్యం వందలాది మంది ప్రయాణికులు వ్యయ ప్రయాసల కోర్చి కామారెడ్డి స్టేషన్‌కు వెలుతున్నారు. ఈవిషయమై బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికై కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
అక్కన్నపేట స్టేషన్‌లో రాయలసీమ, అజ ంతా ఎక్సప్రెస్‌ల స్టాప్ లేకపోవడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి భక్తు లు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కామారెడ్డి స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి వెళ్తున్నారు. కామారెడ్డి, మేడ్చల్ స్టేషన్ల మధ్య ఇదే అతిపెద్ద స్టేషన్ కావడంతో ఈ విషయమై ఆశాఖ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
– పోచమ్మల అశ్విని, రామాయంపేట

నో స్టాప్..!