
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో బ్రిడ్జి, చెరువు, కుంటలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని దూప్‌సింగ్ తండా బ్రిడ్జిని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జరిగిన జాప్యంపై పీఆర్ ఈఈ గోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో రూ. 3 కోట్లతో నిర్మాణమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి తండావాసులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. భారీ వ ర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రజలు వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున ఆదిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో వాగులు, వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్‌శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంత రం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పంచాయతీ ఎన్నికల కోసం గ్రామ యూనిట్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే హవేళిఘణాపూర్ రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలపై ఆరా తీశారు. ఎరువుల కొరత లేకుండా రైతులకు అవసరం ఉన్న యూ రియాను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఇన్‌చార్జి ఎంపీడీఓ కృష్ణమోహన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.