
ఆ మాటలు వెనక్కి తీసుకోండి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాలనా అధికారుల మనోభావాలు దెబ్బతిసేలా మాట్లాడితే సహించేది లేదని టీఎన్జీఓస్ జిల్లా జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లాలో ప్రగతి పాలన అందిస్తున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రభుత్వ అధికారులు అమలు చేస్తారన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.