
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మనోహరాబాద్(తూప్రాన్): మానవాళికి ప్రాణవాయువును అందించే మొక్కలను పెంచే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కాళ్లకల్ శివారులో గల లోకేశ్ మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మొక్కలు నాటి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పరిశ్రమల శాఖ లక్ష్యం మేరకు మొదటి విడతలో 2,000, రెండో విడతలో 3,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. దీనికి ఆయా పరిశ్రమల ప్రతినిధులు స్పందించి ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఆయన వెంట ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ ప్రకాశ్‌రావు, తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పరిశ్రమల డైరెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్