
సమయపాలన తప్పనిసరి
డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
మెదక్ కలెక్టరేట్: సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు గోల్కొండ వీధిలో గల బస్తీ దవాఖానాను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, మందులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. అలాగే ఫీవర్ సర్వే నిర్వహించి కలరా, టైఫాయిడ్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ హరి ప్రసాద్, ఇతర వైద్యులు, సిబ్బంది ఉన్నారు.