ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ

Aug 8 2025 9:13 AM | Updated on Aug 8 2025 9:13 AM

ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ

ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బందితో మాట్లాడి, అస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. మెడికల్‌ ఆఫీసర్‌ సాయిసింధుకు పలు సూచనలు ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మహాధర్నాకు తరలిరండి: పీఆర్టీయూ

చిన్నశంకరంపేట(మెదక్‌): సెప్టెంబర్‌ 1న ఉపాధ్యాయ సమస్యలపై హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని చందంపేట, సూరారం, ధరిపల్లి, గవ్వలపల్లి, కొర్విపల్లి పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తాత్సా రం చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు హరిబాబు, నరేశ్‌, చారి, నాగరాణి పాల్గొన్నారు.

యూరియా కొరత

సృష్టిస్తే చర్యలు

నర్సాపూర్‌: మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి హెచ్చరించారు. గురువారం ఏఓ దీపికతో కలిసి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలు, గోదాంలలో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పర్యావరాణాన్ని కాపాడుతుందని వివరించారు.

పారిశుద్ధ్య పనులు

సక్రమంగా నిర్వహించాలి

రామాయంపేట(మెదక్‌): మండలంలోని తొనిగండ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రా న్ని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్య పను లు సక్రమంగా నిర్వహించాలని, సీజనల్‌ వ్యా ధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీ ఓ సజీలుద్దీన్‌, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

18 ఫీట్లకు చేరిన

పోచారం నీటిమట్టం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఈ సమయానికి నిండిన డ్యామ్‌ ఈసారి పెద్దగా వర్షాలు కురువకపోవడంతో నిండలేదు. ప్రస్తుతం డ్యామ్‌లో 18 ఫీట్ల మేర నీరు చేరింది. మరో మూడు ఫీట్ల నీర చేరితే పొంగిపొర్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement