
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. ఈమేరకు విద్యార్థులతో కలిసి గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 4 వరకు విద్యార్థి అధ్యయన యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, జనరల్ హాస్టళ్లు, కేజీబీవీ, గురుకులాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీ, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. శిథిలావస్థలో భవనాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, అజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు, కార్తీక్, పోచయ్య, ర మేశ్, అజయ్‌కుమార్, విద్యార్థులు త దితరులు పాల్గొన్నారు.