
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి
మెదక్‌జోన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమా వేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు ప్రజలతో కలిసి తిరంగా యాత్ర, ఇతర దేశభక్తి పూరిత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సిందూర్ గొప్ప విజయం సాధించిందన్నారు. మోదీ నాయకత్వంలో కొత్త సుసంపన్న, బలమైన, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. ఆపరేషన్ సిందూర్ అఖండ విజ యం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ పతాకంతో దేశభక్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, రాష్ట్ర కౌ న్సిల్ మెంబర్ రాగి రాములు, నాయకులు రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, సత్య నారాయణ, కాశీనాథ్, మధు సూదన్‌తో పాటు ఆయా మండలాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్