
కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల మంజూరు విష యమై ఎంతమాత్రం పట్టించుకోలేదన్నారు. కా ంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని వివరించా రు. నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రామాయంపేటకు రూ. 200 కోట్లతో సమీకృత గురుకులం మంజూరు చేయించినట్లు తెలి పారు. అలాగే నిజాంపేటలో రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందం, తహసీల్దార్ రజనికుమారి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే రోహిత్ లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.
గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్