
భరోసా సేవలు అభినందనీయం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
మెదక్ మున్సిపాలిటీ: భరోసా సెంటర్ సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌లో 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి న్యాయ మూర్తి కేక్ కట్‌చేశారు. ఈసందర్భంగా పిల్లల పై లైంగిక దాడుల నివారణ, బాధితుల పునరావాసంపై చర్చించారు. పునరావాసంపై మరి ంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నా రు. స్కూల్ విద్యార్థుల సహకారంతో రూపొందించిన అవగాహన చిత్రాన్ని విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, జిల్లా బాలల సంక్షేమ అధికారి కరుణశీల తదితరులు పాల్గొన్నారు.