
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి
నర్సాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి, దో షులను శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కుంభకోణంలో అప్పటి ఆర్థిక మంత్రి పాత్రను బయటకు తీయాలన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ తాత్సారం చూస్తుంటే బీఆర్‌ఎస్ తప్పిదాలను కప్పి పుచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఘటనలో చర్యలు లేవన్నారు. సమావేశంలో ఓబీసీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు సురేశ్, రమణారావు, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.