
నాణ్యతగా ఇళ్లు నిర్మించుకోవాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
తూప్రాన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు నాణ్యతగా నిర్మించుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. బుధవారం మండలంలోని వెంకటాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ. 5 లక్షల చొప్పున ఇంటి నిర్మాణం కోసం కేటాయించిందన్నారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. విషపూరితమైన రోగాలు వచ్చి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని, ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సతీశ్, సిబ్బంది ఉన్నారు.