
మహనీయుడు జయశంకర్
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనకు జయశంకర్ మార్గదర్శనంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ భుజంగరావు, ఏఓ యూనస్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, సహాయ అధికారి గంగా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలోని 132/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కాళ్లకల్ విద్యుత్ ఏఈ రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన కల్పించాలి
టేక్మాల్(మెదక్): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని బొడ్మట్‌పల్లిలో పర్యటించారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా, గుంతల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ రియాజొద్దీన్, వైద్యురాలు హర్షిత, పంచాయతీ కార్యదర్శి మౌనిక, సిబ్బంది ఉన్నారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టండి
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి ఫాగింగ్ నిర్వహించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవా రం పట్టణంలోని నాలుగో వార్డులో మురుగు కాలువలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్యానికి సంబంధించి కమిషనర్ దేవరాజ్‌కు, ఇతర సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆమె వెంట రజనికుమారి, ఇతర అధికారులు ఉన్నారు.
ఢిల్లీ ధర్నాలో జిల్లా నేతలు
నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా లో జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మహనీయుడు జయశంకర్

మహనీయుడు జయశంకర్