
మొక్కలు నాటి సంరక్షించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్/నర్సాపూర్ రూరల్: విద్యార్థులు తాము నాటిన మొక్కలను కాపాడే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వన మహోత్సవంలో భాగంగా అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాలేజీలో హాజరుశాతం పెరిగిందని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కాలేజీ పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శేషాచారి, లెక్చరర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఓపి రిజిస్టర్, మందుల స్టాక్, ఇతర రికార్డులను పరిశీలించారు. అలాగే గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకుంటే దశలవారీగా బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ మధులత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
మెదక్ కలెక్టరేట్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ అధికారుల సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తమ పని తీరు కనబర్చిన ఉద్యోగుల వివరాలు కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. అనంతరం ఈనెల 11 నుంచి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉన్నాయని, చిన్నారులతో పాటు కౌమార దశలో ఉన్న యువతకు వేయాలని ఆదేశించారు.