
భూ సమస్యలను పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేశ్
టేక్మాల్(మెదక్): భూ భారతి దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి రికార్డుల ను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలిస్తూ అవసరమైతే ఫీల్డ్‌కు వెళ్లి పరిశీలించి సమస్యలు పరిష్కరించాలన్నారు. పూర్తి చేసిన ఫైల్స్ వివరాలను ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్ చేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందించాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను ఒకటికి, రెండు సార్లు పరిశీలిస్తూ పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరాం, ఆర్‌ఐ సాయి శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్లు నవీన్‌కుమార్, గణేశ్, సర్వేయర్ మహేశ్ ఉన్నారు.