
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొండల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. విద్యారంగ బడ్జెట్‌ను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో టీచర్లను నియమించకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. 5571 ిపీఎస్ హెచ్‌ఎం పోస్టులు ప్రకటించాలని, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసి, జీవో నెంబర్ 25 ను సవరించాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం ఇవ్వాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్ 010 హెడ్ కింద జీతాలు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ యూనస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘల పోరాట కమిటీ నాయకులు యాదగిరి. వెంకట్ రామ్ రెడ్డి, పద్మా రావు,శ్రీనివాస్ రావు,శ్రీనివాస్ రెడ్డి,గోపాల్, సురేందర్, రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్,నజీరోద్దీన్, కవిత, రజిత,సంగీత, దేవీ సింగ్, అజయ్,రవి, నాగేష్, శేఖర్, గంగాధర్,నర్సింలు,గిరి, నాచారం,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి
కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల నిరసన