
కార్మికుల హక్కులపై కేంద్రం దాడి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య
తూప్రాన్: బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులపై దాడి చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య ఆరోపించారు. సోమవారం పట్టణంలో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ‘లేబర్ కోడ్స్– కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ జీఓ విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ..జిల్లాలో మొదటిసారిగా సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్య క్రమంలో ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ అడివయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.