
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
వెల్దుర్తి(తూప్రాన్): భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఏదులపల్లిలో పలువురు యువకులు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలన్నారు. తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. జిల్లాలో తాను ఎంపీగా గెలిచిన కొన్ని నెలల వ్యవధిలోనే కేంద్ర నుంచి రూ. వందల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానన్నారు. పార్టీలో చేరిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మండల అధ్యక్షుడు దాసు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నర్సింలు, వెంకటేశం, నరేష్, బాలకిషన్, శేఖర్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హిందువులు చైతన్యవంతులు కావాలి
మెదక్‌జోన్: హిందూ మతం మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, హిందువులు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఆసన్నమైందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మెదక్ కోదండ రామాలయాన్ని అధికారులు శనివారం ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవడంతో ఆలయాన్ని సందర్శించి మాట్లాడారు. వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకున్నాక అక్కడ దీపం పెట్టేవారు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఆలయ కమిటీ తప్పులు చేస్తే శిక్షించాలి, అవసరమైతే వారిని తప్పించి మరో కమిటీని నిర్ణయించాలి, కానీ అధికార పార్టీ నేతలు చెబితే తాళాలు వేస్తారా..? అని ప్రశ్నించారు. కశ్మీర్‌లో సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తుంటే, యూపీఏ నేతలు మాత్రం పాక్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అన ంతరం పట్టణంలోని గాంధీనగర్‌లో కేన్సర్ ఆస్పత్రి కోసం స్థలాన్ని పరిశీలించారు. దేశంలోనే మొట్ట మొదటగా జిల్లా కేంద్రంలో కేన్సర్ ఆస్పత్రిని దాతల సహకారంతో పాటు ఎంపీ నిధులు వెచ్చించి నిర్మిస్తానన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు