
సీసీ కెమెరాలతోనేరాల నియంత్రణ: ఎస్పీ
తూప్రాన్: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను ప్రారంభించారు. అనంతరం అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి, సైబర్ నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసినవి అందజేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ శివానందం, మున్సిపల్ కమిషనర్ గణేశ్‌ను అభినందించారు. అనంతరం మండలంలోని ఇమామ్‌పూర్‌లో గ్రామస్తులు సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
దరఖాస్తుల అహ్వానం
మెదక్ కలెక్టరేట్: స్కాలర్‌షిప్‌ల కోసం ఎస్సీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025– 26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్‌షిప్‌లు అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులంతా సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.