
చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
నర్సాపూర్: పాఠశాలలకు వచ్చే చిన్న పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత సూచించారు. శనివారం మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలను బయటకు ఎందుకు పంపుతున్నారని ఉపాద్యాయులను ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేనందున బయటకు పంపాల్సి వస్తుందని వారు వివరించారు. పిల్లల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల గదులలో విద్యార్థులకు విద్యా బోధన చేపట్టడం సరికాదన్నారు. ఉన్నతాధికారులకు విషయం చెప్పారా..? అని ప్రశ్నించారు. కాగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిన విషయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తానని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
జూనియర్ సివిల్ జడ్జి హేమలత