ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం
విధుల్లో నైతిక విలువలు పాటించాలి
● భూ భారతితో న్యాయం చేస్తాం
● కలెక్టర్ రాహుల్‌రాజ్
చిన్నశంకరంపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: భూ భారతి గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని కొర్విపల్లిలో నిర్వహించిన భూ భారతి గ్రామసభను పరిశీలించారు. రైతులు అందించిన దరఖాస్తులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని.. కలెక్టరేట్‌కు ఎవరూ రావొద్దని సూచించారు. అనంతరం గవ్వలపల్లిలోని విత్తన దుకాణాన్ని పరిశీలించా రు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని డీలర్‌కు సూచించారు. అలాగే చిన్నశంకరంపేటలోని స్టీల్ అండ్ సిమెంట్ దుకాణాన్ని తనిఖీ చేసి ధరల వివరాలను తెలుసుకున్నారు. సిమెంట్‌ను ఎక్కు ధరను అమ్ముతున్నట్లు గుర్తించారు. స్టీల్, సిమెంట్‌ను అధిక ధరలకు అమ్మవద్దని హెచ్చరించారు. అలాగే రేషన్ దుకాణాన్ని పరిశీలించి సన్న బియ్యం పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులో ప్యాడీ క్లీనర్ యంత్రాలను ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్ నుంచి ఈ యంత్రాలు అందుబాటులో ఉంచుతామన్నారు.
ఇన్‌చార్జి ఎస్పీ రాజేష్‌చంద్ర
ఎస్‌ఐ విధులకు ఆటంకంకలిగించిన కానిస్టేబుల్‌పై వేటు
మెదక్ మున్సిపాలిటీ: పోలీసులు విధుల్లో నైతిక విలువలు పాటించాలని ఇన్‌చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మెదక్ మ ండలం తిమ్మక్కపల్లి సమీపంలో రెండు టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన మెదక్ రూరల్ ఎస్‌ఐ మురళి విధులకు కొల్చారం పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజ్‌కుమార్ అడ్డుపడటమే కాకుండా అక్రమ ఇసుక రవాణాదారులకు మద్దతుగా వ్యవహరించాడని.. ఈమేరకు అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశా మన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం


