
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం
కొల్చారం(నర్సాపూర్): ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి ఐకేపీ కేంద్రంలో వర్షానికి తడిసి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ఒత్తిడి కారణంగానే ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేయకపోవడం, తూకం వేసిన ధాన్యం బస్తాలను రవాణా చేయడంలో ఆలస్యం కారణంగా వర్షానికి ధాన్యం తడిసిపోయిందన్నారు. రంగు మారిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఒక్క పోతంశెట్టిపల్లి కేంద్రంలోనే సకాలంలో లారీలు రాక తూకం వేసిన 9 లారీలకు సంబంధించి సన్న వడ్లు, 19 లారీల దొడ్డు వడ్లు వర్షానికి తడిసి బస్తాల్లోనే మొలకెత్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, సంతోష్ కుమార్, యాదయ్య, యాదగౌడ్, ప్రవీణ్, గౌరీశంకర్ ఉన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి