
ముగిసిన శిబిరం.. చిన్నారుల ఉత్సాహం
విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. చిన్నారులకు యోగా, కరాటే, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయా అంశాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ తారాసింగ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఆసక్తి ఉన్న అంశాలపై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. – నర్సాపూర్