
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా అందించే ఇసుక సరఫరాకు స్థానిక వనరులను గుర్తించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్, మైనింగ్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1 లక్ష 74 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అవసరం అన్నారు. అందుకనుగుణంగా అధికారులు సమన్వయంతో జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. ఇసుక రీచ్‌లు జిల్లాలో లేనందున స్థానిక వనరుల స్ట్రీమ్స్ నుంచి గుర్తించి లబ్ధిదారుడి ఇంటి దగ్గరే ఇసుక సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంజీరా నది ఇసుక గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం రాకముందే ఇందిరమ్మ ఇండ్లు వాల్స్ వరకు పూర్తవ్వాలని చెప్పారు. అనంతరం నూతన పంచాయతీల సెగ్రిగేషన్ షెడ్స్, భవనాలకు కావాల్సిన భూమిని గుర్తించే విషయంలో తహసీల్దార్లు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే జూన్ 2 నుంచి జిల్లాలోని ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలి పారు. ఇందుకోసం ఆర్డీఓలు, తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్డీఓలు రమాదేవి, జై చంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.