
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కోహెడ(హుస్నాబాద్): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 41 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా నియోజకవర్గంలో 3,500 మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు.
కార్యకర్తలతో కలిసి సంబరాలు
ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలతో కలిసి సంబరాలు చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సిందూర్‌ను భారత ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి భారత సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మంత్రి జన్మదినం కావడంతో కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. కేక్‌కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగామూర్తి, కోహెడ ఏఎంస్సీ చైర్మన్ నిర్మల జయరాజ్, ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌పై సంబరాలు