ప్రభువా.. కరుణించు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఇన్‌చార్జి బిషప్ రూబెన్‌మార్క్ హాజరై దైవసందేశం ఇచ్చారు. పరలోక దేవుడు ఏసయ్య పాపుల రక్షణ కోసం సిలువ వేయబడి, తిరిగి మూడు రోజుల అనంతరం సమాధి నుంచి లేచిన పర్వదినాన్ని ఈస్టర్ డేగా జరుపుకుంటామని తెలిపారు. అనంతరం ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య మాట్లాడుతూ.. పరలోక దేవుడు పాపుల రక్షణ కోసమే అవతరించాడన్నారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు చర్చి చుట్టూ శిలువను ఊరేగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
– మెదక్‌జోన్
ప్రభువా.. కరుణించు


