రజతోత్సవ సభకు తరలిరండి
శివ్వంపేట(నర్సాపూర్): ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ కూడళ్లతో పాటు తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన గల కల్వర్టు గోడపై రాస్తున్న వాల్ రైటింగ్‌ను శనివారం పరిశీలించారు. ప్రతి గ్రామం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు మన్సూర్, హన్మంత్‌రెడ్డి, లాయక్ తదితరులు పాల్గొన్నారు.
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో శనివారం వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరి ంచుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీపై ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
మనోహరాబాద్(తూప్రాన్): హనుమాన్ జయ ంతి సందర్భంగా శనివారం మండలంలోని కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం, కూచారంలోని హనుమాన్ దేవాలయం, కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. హనుమంతుడికి ఆమె పట్టువస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మా ట్లాడుతూ.. హనుమాన్ దేవాలయ అభివృద్ధికి గతంలో కేసీఆర్ రూ. 22 లక్షలు అందజేశారని గుర్తుచేశారు. ఆమె వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ హేమలత, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక నాయకులు కొట్టాల యాదగిరి, పురం రవి, రేణుకుమార్, భిక్షపతి, అర్జున్, దాసరి నరేష్, ఉదయ్‌రంజన్‌గౌడ్, ఆంజనేయులు, రాజు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పంచాయతీ కార్మికులు ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు.
న్యాయం చేయండి
కొల్చారం(నర్సాపూర్): విధులు నిర్వర్తించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని చిన్నఘనాపూర్ పీఏసీఎస్ సీఈఓ సత్యనారాయణరెడ్డి రెండు రోజులుగా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు. పాలకమండలి, సీఈఓ మధ్య మూడేళ్లుగా లావాదేవీల విషయమై వివాదం కొనసాగుతోంది. సంఘానికి చెందిన సొమ్మును సొంతానికి వాడుకున్నారని సీఈఓను పక్కన పెట్టారు. ఈ విషయం సత్యనారాయణరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టును ఆ శ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 44 నెలల పెండింగ్ వేతనం చెల్లించాలని కలెక్టర్, మరో నలుగురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇటీవలే విధుల్లోకి తీసుకున్నా రు. మూడు రోజుల అనంతరం కార్యాలయంలోనికి వెళ్లకుండా పాలకమండలి సభ్యులు గదికి తాళం వేశారు. చేసేది లేక ఆరుబయటే ఉంటూ నిరసన తెలుపుతున్నాడు.
డంపింగ్‌యార్డ్ మాకొద్దు
67వ రోజుకు చేరిన నిరసన
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు శనివారం నాటికి 67వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొసాగుతున్నాయి.
రజతోత్సవ సభకు తరలిరండి
రజతోత్సవ సభకు తరలిరండి


