18 రోజులు.. రూ.8లక్షలు
ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం
కలెక్టర్ రాహుల్‌రాజ్
అధిక బిల్లులు వేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
నర్సాపూర్: తన భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడితే స్థానిక కేఏకే ఆసుపత్రిలో చేర్పించగా అడ్డగోలుగా బిల్లులు వసూలు చేశారని పట్టణానికి చెందిన బైల్‌పాటి లక్ష్మి ఆరోపించింది. మంగళవారం ఆమె ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. తన భర్త గణేశ్ జనవరి 8న రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైతే స్థానిక కేఏకే ఆసుపత్రిలో చేర్పించగా 18 రోజుల పాటు వైద్యం చేసి రూ.8లక్షల బిల్లు వేశారని తెలిపారు. ఏమాత్రం నయం కాలేదని, బిల్లు మొత్తం చెల్లించి సంగారెడ్డిలోని మరో ఆసుపత్రికి వెళ్లి అక్కడ వారం రోజుల పాటు వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించామని చెప్పింది. కాగా కేఏకే ఆసుపత్రిలో వారిష్టమున్నట్టు టెస్టులు చేయించారని, వాటికి ఎక్కువ ధరలు వసూలు చేశారని ఆమె ఆరోపించారు.అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లించామన్నారు. కాగా ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చానని, తమకు జరిగిన అన్యాయం నాయకులకు వివరించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థిచండానికి వచ్చానన్నారు. తాను వచ్చే సరికి అందరూ వెళ్లిపోయారని విచారం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరిగిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని లక్ష్మి ప్రభుత్వ అధికారులను, నాయకులను కోరింది. ఈ విషయమై ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ హసన్‌బాషాను వివరణ కోరగా బైలపాటి గణేశ్ విషయం తనకు తెలియదని, అతనికి వైద్యం చేసిన డాక్లర్లు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పారు.
రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని దామరచెరువులో ఇళ్ల నిర్మాణం, రామాయంపేటలో నిర్మించిన మాడల్ హౌజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతగా త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈ మేరకు లబ్ధిదారులను చైతన్యపర్చాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకోవాలన్నారు. అనంతరం ఈ పథకానికి సంబంధించి హెల్ప్‌డెస్క్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట గృహ నిర్మాణశాఖ పీడీ మాణిక్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
18 రోజులు.. రూ.8లక్షలు


