డీసీసీబీకి అవార్డు
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట డీసీసీబీ బ్యాంకుకు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. ఈ మేరకు సోమవారం సంగారెడ్డిలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవెందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్, డీడీఎం కృష్ణ తేజ, నిఖిల్ కుమార్ చేతుల మీదుగా బ్యాంక్ మేనేజర్ కిషన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తాను పాపన్నపేటలో బాధ్యతలు చేపట్టేనాటికి రూ.31 కోట్ల బిజినెస్ కొనసాగేదని, ఇప్పుడు రూ.51.5 కోట్లు దాటిందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.


