ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం
మెదక్ కలెక్టరేట్: విద్యుత్ సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, విద్యుత్ మీటర్ సమస్యలు, బిల్లుల్లో సమస్యలు, కొత్త సర్వీస్‌లు, యాజమాన్య బదిలీ, కనెక్షన్ల పునరుద్ధరణ, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ పరిష్కార వేదికలో 105 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను 41 రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శంకర్, ఇండిపెండెంట్ కమిటీ మెంబర్ వెంకట్, టెక్నికల్ డీఈ శ్రీనివాస్, మెదక్ డీఈ చాంద్‌పాష, తూప్రాన్ డీఈ గరుత్మంతా రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీజేఆర్‌ఎఫ్ చైర్మన్ నాగేశ్వరరావు


