కొంగొత్త ఆశలతో..కొత్త ఏడాదిలోకి
● 2025కి వీడ్కోలు.. 2026కు స్వాగతం
● జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు
కొంగొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో జిల్లా వాసులు 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను సాక్షితో పంచుకున్నారు. వెల్లడించిన అంశాలు.. వారి మాటల్లోనే..
– మెదక్‌జోన్
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
కొత్త సంవత్సరంలో అన్నిరంగాల్లో మరింతగా పురోగతి సాధించేందుకు ప్రాణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. ప్రధానంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. పది పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్‌లో చేరేలా ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలో పలు టూరింజం స్పాట్లు ఉండటంతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తా.
– రాహుల్‌రాజ్, కలెక్టర్
గౌరవెల్లితో సాగు నీటిని అందిస్తా..
గౌరవెల్లి రిజర్వాయర్‌కు అనుబంధంగా కాలువలు నిర్మించి సాగు నీటిని అందించి మూడు పంటలు పండేలా కృషి చేస్తా. హుస్నాబాద్‌లో ప్రారంభమైన అభివృద్ధి పనులు త్వ రగా పూర్తి చేయిస్తా. సర్వాయి పాపన్న నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గానికి ట్రీపుల్‌ఐటీ బ్రాంచ్‌ను, నవోదయ వచ్చేందుకు నా వంతు కృషి చేస్తా. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా.
– పొన్నం ప్రభాకర్,
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి
కొంగొత్త ఆశలతో..కొత్త ఏడాదిలోకి
కొంగొత్త ఆశలతో..కొత్త ఏడాదిలోకి


