గ్రామాలకు బస్సులు నడపండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
నిజాంపేట(మెదక్): మండలంలోని పలు గ్రామాలకు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సరిపడా బస్సులు నడపాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్లోళ్ల శశిధర్‌రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్, రాంపూర్ మీదుగా గతంలో బస్సులు నడిచేవన్నారు. రోడ్డు దుస్థితి కారణంగా డిపో మేనేజర్లు వాటిని నిలిపివేశారు. అలాగే మండలంలోని రాయిలాపూర్, బచ్చురాజ్‌పల్లి, తిప్పన్నగుల్ల, కల్వకుంట, నార్లాపూర్ మీదుగా మరో బస్సు నడిచేదని తెలిపారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పై చదువుల కోసం సుమారు వందకు పైగా విద్యార్థులు రా మాయంపేట, సిద్దిపేటకు తరలివెళ్తుంటారు. కావున మండలంలోని పలు గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు. .


