నూతనోత్సాహం
అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు
మెదక్‌మున్సిపాలిటీ: కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. జిల్లావ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికారు. హాటళ్లు, బేకరీ దుకాణాలన్నీ కిటకిటలాడాయి. కొన్ని పాఠశాలల్లో ముందస్తుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం రాత్రి 12 గంటల తరువాత ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ న్యూఇయర్ విషెస్ చెప్పుకొన్నారు. గురువారం జిల్లాలోని ఆలయాలకు, చర్చికి భక్తు లు భారీగా తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


