ప్రైవేట్‌కు పంపితే కఠిన చర్యలు
తూప్రాన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేట్‌కు సిఫార్సు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం తూప్రాన్‌లోని సీహెచ్‌సీ నూ తనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ ఆస్ప త్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలు తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 80 అంబులెన్స్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రీజినల్ కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దృష్టి సారించినట్లు తెలిపారు. తూప్రాన్ ఆసుపత్రిలో ప్రతిరోజు 20 మందికి డయాలసిస్ సేవలు అందించవచ్చని వివరించారు. అనంతరం పట్టణ సమీపంలోని బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
పోటాపోటీ నినాదాలు
డయాలసిస్ సెంటర్ ప్రారంభ ం సందర్భంగా
మంత్రి దామోదర, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీ యాల గుర్తించి పలువురు చర్చించుకున్నారు.


