మెదక్ మున్సిపాలిటీ: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్, తహసీల్దార్ లక్ష్మణ్, ఇతర మత పెద్దలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మజర్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విదేశి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ పేర్కొన్నారు. మే 19 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.