గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
● రిటైర్డ్ ఉద్యోగులకు అందని బెనిఫిట్స్ ● ఏడాదిగా తప్పని ఎదురుచూపులు
D ¸÷sZÌZ° Ð]lÅMìS¢ fÒ$ÆŠ‡ çßæÒ$§Šæ. Ð]lÊyýl$ §ýlÔ>-»êªÌS ´ër$ E´ë-«§éÅ-Ķæ¬yìlV> Ñ«§ýl$Ë$ °Æý‡Ó-Ç¢…_ 2024 Ð]l*ÇaÌZ ÇOsñæÆŠḥz AĶæ*ÅÆý‡$. M>V> C™èl-°MìS {糿¶æ$™èlÓ… ¯]l$…_ Æý‡*. 50 ÌS„ýSÌS ÇOsñæÆð‡Ã…sŒæ »ñæ°íœsŒæÞ Æ>ÐéÍÞ E…¨. Ð]l^óla yýlº$¾ÌS™ø CË$Ï MýSr$t-Mø-ÐéÌS° MýSÌSÌS MýS¯é²yýl$. Hyé-O§ðl¯é yýlº$¾Ë$ ^ól†MìS Æ>MýS-´ù-Ð]l-yýl…™ø Cº¾…¨ ç³yýl$™èl$-¯é²Æý‡$. hÌêÏÌZ CÌê…sìæ ÐéÆý‡$ Ð]l$Æø 140 Ð]l$…¨ E§øÅVýS$Ë$ E¯é²Æý‡$.
మెదక్‌జోన్: సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్‌లో దాచుకున్న డబ్బులు.. పదవీ విరమణతో అందే ఆర్థిక ప్రయోజనాలతో ఎన్నెన్నో కలలు కన్న వారి ఆశలు ఆడియాశలుగానే మారుతున్నాయి. బిడ్డ పెళ్లికి, సొంత ఇంటికి, పిల్లల చదువులకు ఢోకాలేదనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక.. అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో 200 మంది ఉద్యోగులు
జిల్లాలో 2024 మార్చిలో సుమారు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారు. కాగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో 60 మందికి అందజేశారు. మరో 140 మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. డబ్బుల కోసం నిత్యం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే డబ్బులతో కొందరు ఇల్లు కట్టుకుందామని చూస్తుంటే, మరికొంత మంది ప్లాట్లు కొనుగోలు చేయాలని, ఇంకొందరు పిల్లల పెళ్లిళ్లు చేయాలని అనుకున్నామని.. సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఆలోచనలు తలకిందులయ్యాయని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పొడిగిస్తే ప్రస్తుత ప్రభుత్వం రిటైర్డ్ అయి ఏడాది గడుస్తున్నా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలో 2021లో వివిధ శాఖల్లో 200 మంది ఉద్యోగులు రిటైర్డ్ కావాల్సి ఉండగా, గత ప్రభుత్వం మూడేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో 2024 మార్చిలో పదవీ విరమణ పొందారు.
న్యూస్‌రీల్
అ‘విశ్రాంత’ పోరాటం
అ‘విశ్రాంత’ పోరాటం