గ్యారంటీగా మద్దతు ఇస్తాం... | Sakshi
Sakshi News home page

గ్యారంటీగా మద్దతు ఇస్తాం...

Published Wed, Nov 15 2023 4:36 AM

- - Sakshi

మద్దూరు(హుస్నాబాద్‌): జనగామ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు రాకేష్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని రేబర్తి గ్రామంలో జెడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఆరు గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. స్థానికుడైన ప్రతాప్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శివయ్యగౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, పూల్లురి రాజు, ఇర్రి రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement