సారూ.. సమస్యలు తీర్చరూ..! | - | Sakshi
Sakshi News home page

సారూ.. సమస్యలు తీర్చరూ..!

Nov 17 2026 12:26 AM | Updated on Nov 17 2026 12:26 AM

● ప్రజావాణిలో ప్రజల బారులు ● అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు ● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● పట్టాపాస్‌ పుస్తకంలో ఇంటి పేరు మార్చాలని కన్నెపల్లి మండలం చింతపూడి గ్రామానికి చెందిన నాయిని అంజక్క దరఖాస్తు అందజేసింది. ● మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారు సర్వే నంబరు 341లో తన ఐదెకరాల భూమి ఆక్రమణకు గురైందని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని గ్రామానికి చెందిన చెగ్యాం బొందయ్య కోరాడు. ● తమ తల్లి పేరిట ఉన్న భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెన్నెలకు చెందిన పోతరాజుల రాజక్క, దెబ్బటి వనిత, పున్నపురెడ్డి లలిత ఫిర్యాదు చేశారు. ● మంచిర్యాల కాలేజీ రోడ్డులో ఉన్న ప్లాటులో కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ధిక్కరించి కంపౌండ్‌ వాల్‌ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన భుక్యా లీల కోరింది. ● కలెక్టరేట్‌లో పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్‌కు నలుగురు చిన్నారులు సమస్యలపై దరఖాస్తులు అందజేశారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: కలెక్టర్‌ సారూ.. సమస్యలు పరిష్కరించండి అంటూ ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బారులు తీరి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్వో మోతిరాంతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు తదితర వాటిపై అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. 58 దరఖాస్తులు అందాయని తెలిపారు. సామాన్య ప్రజలకు న్యాయం, సలహాలు, సూచనలు ఇవ్వడానికి న్యాయసేవాధికార సంస్థ తరఫున ఒక న్యాయవాది ప్రజావాణిలో అందుబాటులో ఉంటారని, సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement