పరిహారం చెల్లించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

పరిహారం చెల్లించాలని ధర్నా

Nov 17 2026 12:26 AM | Updated on Nov 17 2026 12:26 AM

జైపూర్‌: వరంగల్‌–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్‌లో ఉన్న నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కిష్టాపూర్‌ హైవే రోడ్డు క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రెండేళ్ల క్రితం ఎకరానికి రూ.21లక్షల పరిహారం ఇస్తామని హామీనిచ్చి ఇప్పటివరకు రూ.18లక్షలు మాత్రమే చెల్లించాలరని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా రూ.3లక్షలు, ఇతర బకాయిలను విడుదల చేయాలని కోరారు. స్పందించిన మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు రైతులతో మాట్లాడారు. పరిహారం త్వరలో ఇప్పించేందుకు చర్యలు చేపడుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు సుందిళ్ల మల్లేశ్‌, తుమ్మనపల్లి నర్సింగరావు, గోదారి రాజయ్య, జాడి రాజయ్య, సమ్మయ్య, ఆకుదారి మొండి, బల్ల మొగిలి, ప్యాగ చందు, వడ్లకొండ సతీశ్‌, తిరుపతి, లింగయ్య, అంకయ్య, నాగరాజు, ముత్తయ్య, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement