మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్‌స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల సీజ్ వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో కేసుల వివరాల నమోదు తదితర అంశాలపై ఆరా తీసి పెండింగ్ కేసులు, నేర రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ వివరాలపై ఎస్సై కిరణ్‌కుమార్ వివరించారు. గుడిపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సీపీ పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి న చర్యలపై సూచనలు చేశారు.
పారదర్శక విచారణ
మంచిర్యాలక్రైం: ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రతీ ఫిర్యాదుపై సీపీ అంబర్ కిషోర్ ఝా తక్షణమే స్పందిస్తూ పారదర్శక విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో సీపీ ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరిధిలో విచారణ చేయాలని ఆదేశించారు. అదనపు డీసీపీ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.


